Breaking News

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశమే లేదు

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశమే లేదు

  • పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ


సారథి న్యూస్​, హైదరాబాద్: నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకున్న బీజేపీ తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. అలాంట బోర్డు ఏర్పాటుచేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పసుపు బోర్డు పెట్టే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. టీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఉన్నందున పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొస్తామని బీజేపీ నిజామాబాద్​ పార్లమెంట్​ సభ్యులు అరవింద్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.