- అధికార పార్టీల తీరు బీజేపీకి కలసివస్తోంది
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సామాజిక సారథి, తిరుపతి: పంజాబ్ రైతుల నిరసనపై ప్రధాని మోడీ కొత్త నాటకానికి తెరతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్ లో తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని నరేంద్ర మోడీ సానుభూతి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నటనలో నేచురల్ స్టార్‌ని మించిపోయారని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో రైతులు ఆగ్రహంతో ఉండి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దానిని వక్రీకరించే ప్రయత్నాలు దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత లోటుపాట్లు సరిదిద్దు కోకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల చర్యలతోనే బీజేపీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. జనసేన పొత్తులపై చంద్రబాబు చేసిన రాజకీయ చంచలత్వానికి నిదర్శనం. పొత్తులపై చంద్రబాబుకు క్లారిటీ లేకపోతే టీడీపీకి వచ్చే ఎన్నికల్లోనూ ఇబ్బందులు తప్పవు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే మా నిర్ణయం మేము తీసుకుంటామని వివరించారు.