సారథి, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగాపుర్(నారాయణ పూర్)గ్రామంలోని బండ్లపాడు కోయగూడెంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. ఊరికి దూరంగా అడవినే నమ్ముకొని బతుకుతున్న కోయగూడెం ప్రజలకు నెలకు రూ.6వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఫౌంహౌస్ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలన్నారు. కరోనా గ్రామాలకు కూడా విస్తరించి ప్రాణాలు కోల్పోతున్నారని, టెస్టుల సంఖ్య పెంచి ప్రజలను కాపాడాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో పనులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, టీపీసీసీ కార్యదర్శి పైడకులా అశోక్, జిల్లా, మండలాల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
- May 29, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- LOCKDOWN
- MLA SITHAKKA
- MULUGU
- ఎమ్మెల్యే సీతక్క
- కరోనా
- ములుగు
- లాక్ డౌన్
- Comments Off on ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క