- బీఎస్పీ నకిరేకల్ ఇన్ చార్జి ప్రియదర్శిణి మేడి
- సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులతో కలసి ధర్నా
సామాజిక సారథి, చిట్యాల: నకిరేకల్ నియోజక వర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి మేడి ప్రియదర్శిణి ఆరోపించారు. చిట్యాలలోని సుందరయ్య నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను ఆమె సోమవారం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే కాలనీలో సమస్యలు పరిష్కారం కావడంలేదని స్థానిక ప్రజలతో కలిసి ఆమె ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలో రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, రవాణా సౌకర్యం, డ్రైనేజీల సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. చిట్యాల కేంద్రం నుంచి సుందరయ్య నగర్ కాలనీకి వెళ్ళాలంటే మందుబాబులు, ఆకతాయిల వల్ల ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించకుంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున భారీఎత్తున ఆందోళనలు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ యాకరి కవిత, పోకల అరుణ్, కాలనీ వాసులు మోత్కూరు వెంకన్న, మేడి నరసింహ, ఎర్ర సైదమ్మ, బురున్బీ, అండాలు, అండాలు, ఎల్లమ్మ, యాదమ్మ, లక్ష్మమ్మ, మౌనిక, జరీనా, మస్తాన్, జానమ్మ, మల్లమ్మ, రాంబాబు, అశోక్, నవీన్, శ్రీశైలం, లక్ష్మణ్, రాంమూర్తి, సురేష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.