- పోలీసు ఇన్ఫార్మర్లకు హెచ్చరికలు
సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం గ్రామ సమీపంలోని భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై వెలసిన మావోయిస్టు కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం లేఖ వెలువడటంతో ఈలేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులుకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న బొల్లారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాలకు చెందిన వ్యక్తులు మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని పోలీసులు చూపే ప్రలోభాలకు, డబ్బులను ఆశచూపి ఇన్ఫార్మర్స్ గా మార్చుకొని ప్రజలకు, పార్టీకి ద్రోహం తలపెట్టే తప్పుడు పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల అభిప్రాయం మేరకు ప్రజాకోర్టులో వీరికి శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఆ లేఖల్లో పేర్కొన్నారు.