సారథి ప్రతినిధి, సిద్దిపేట: కారును పార్కింగ్ చేసి స్కూటీపై అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేశాడు. హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ (గోదాంగడ్డ)కు చెందిన సదరు వ్యక్తి స్కూటీపై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి స్కూటీని చెక్ చేయగా అందులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. అతని అదుపులోకి తీసుకొని విచారించగా అర్డర్ పై మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేయడమే కాకుండా ఓ కారులో నిల్వచేసినట్లు గుర్తించారు. కారులో రూ.30వేల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- May 15, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HUSNABAD
- liquire sales
- LOCKDOWN
- SIDDIPETA
- మద్యం విక్రయాలు
- లాక్ డౌన్
- సిద్దిపేట
- హుస్నాబాద్
- Comments Off on స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు