సారథి ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం పదిరోజుల పాటు అనగా.. జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సమావేశానికి రాష్ట్రమంత్రులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లినవారు ఇంటికి చేరడానికి మరో గంటపాటు అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్ డౌన్ తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించారు. రైతుబంధు, ఎరువుల పంపిణీపైనా చర్చ జరిగింది.