Breaking News

వేములవాడలో లాక్ డౌన్

వేములవాడలో లాక్ డౌన్

* రాజన్న సన్నిదిలో కొడేమొక్కులు రద్దు

సారథి, వేములవాడ: శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందింది. రాజన్న ఆలయంలో కారోన వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోంది. దీంతో గురువారం నుండి రాజన్న ఆలయంలో కోడె మొక్కుబడితో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ తెలిపారు. అదే విధంగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి  పాలకవర్గం, అధికారులతో ఏర్పాటు చేసి అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం 6గంటల నుంచి మద్యాహ్నం 2గంటల వరకు అన్నీ వర్తక, వాణిజ్య పరమైన షాపులు తెరిచుంటాయన్నారు. మద్యాహ్నం 2 గంటల నుండి  రాత్రి 9గంటల వరకు  పాక్షిక లాక్ డౌన్  విధిస్తూ తీర్మానించామన్నారు. వేములవాడ లాక్ డౌన్ తో పాటు  రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ  యదావిధిగా కొనసాగుతొందన్నారు. లాక్ డౌన్ కు ప్రజలు, వ్యాపార, వాణిజ్యవర్గాలు సహకరించి కరోనను తరిమివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ కు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్  చైర్మన్ మధు, కౌన్సిలర్లు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.