సామాజిక సారథి, తలకొండపల్లి: భారత్ జోడో యాత్రకు తరలివెళ్లినట్లు తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గుజ్జుల మహేష్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం నుంచి తరలివెల్లిన వాహనాలను జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జిల్లాలోకి ప్రవేశించనున్నదన్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4గంటలకు జోడయాత్ర చేరుకోనున్నదని చెప్పారు. అక్కడి నుంచి ప్రారంభమై జిల్లాలోని లింగంపల్లి, పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి, జోగిపేట, పెద్ద శంకరంపేట వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అంజయ్య గుప్తా, మాజీ ఎంపీటీసీ రాములు, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ మండల నాయకులు విష్ణు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిగ్రీ కృష్ణ, మాధవరెడ్డి, రాఘవేందర్ రెడ్డి, యాదయ్య, రమేష్, మాజీ ఉపసర్పంచ్ చెన్నకేశవులు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శులు రవీందర్, తిరుపతి, యువజన కాంగ్రెస్ నాయకులు అజీమ్, శంకర్, ఆరిఫ్, నరేష్ ముదిరాజ్, నరేందర్ గౌడ్, శివకుమార్ గౌడ్, వెంకటేష్, రాహుల్, వరుణ్, సాయినాథ్, శివ తదితరులు పాల్గొన్నారు.
- November 1, 2022
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- Bharat
- Departed
- GANDHI
- Jodo
- LEADERS
- Patan Cheruvu
- RAHUL
- RANGAREDDY
- Yatra
- Comments Off on భారత్ జోడో యాత్రకు బయలుదేరిన నేతలు