# ఆగ్రహంతో డీఈఓ పై దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
# ప్రభుత్వాలు మారిన ఇంకా మాజీలకే ప్రాధాన్యతనిస్తున్న అధికారులు
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో:
ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారము స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ని ఆహ్వానించిన విద్యాశాఖ అధికారి గోవిందరాజులు స్థానిక ఎమ్మెల్యే రాకముందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో పాఠశాలను ప్రారంభించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది తాడూరు మండలం శిరిసవాడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన ట్రస్ట్ ద్వారా నూతన పాఠశాల నిర్మాణానికి పూనుకొని ప్రస్తుతం అది పూర్తి కావడంతో విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఆ పాఠశాల భవనాన్ని ఆదివారం ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు అటు ఎంజీఆర్ ట్రస్టు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డికి కూడా విద్యాశాఖ అధికారులు సమాచారం అందజేశారు. కానీ విద్యాశాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం సమయానికంటే పది నిమిషాలు ముందే అక్కడికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేరుకునేసరికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెత్తనం ఏమిటని తన ట్రస్టు ద్వారా నిర్మిస్తే ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే రాకముందు ఎలా ప్రారంభిస్తారు అంటూ డిఇఓ పై దాడికి దిగారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని డిఇఓ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
డి ఈ ఓ పై కలెక్టర్కు ఫిర్యాదు
ఒక జిల్లా ఉన్నత స్థాయి అధికారి అయ్యుండి కనీసం ప్రోటోకాల్ మర్యాదలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే రాకముందు ప్రభుత్వ పాఠశాలను ఎలా ప్రారంభిస్తారు అంటూ రాజేష్ రెడ్డి డిఇఓ ను అక్కడే నిలదీశారు దీంతో పాటు స్థానిక కలెక్టర్ ఉదయ్ కుమార్ కు డిఇఓ గోవిందరాజుల పై ఫిర్యాదు చేశారు ఆయనపై ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు ప్రభుత్వాలు మారినప్పటికీ అధికారులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధుల పట్ల మమకారాన్ని చంపుకోవడం లేదని నిబంధనల ప్రకారం 11 గంటలకు పాఠశాల ప్రారంభిస్తామని చెప్పి ఎమ్మెల్యే రాకముందే 10: 30 కు ఎలా ప్రారంభం చేస్తారని ఆయన ప్రశ్నించారు. పాఠశాలను ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించినప్పటికీ అది నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారమే ప్రారంభోత్సవాలు జరగాలని అయినప్పటికీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు