# నిజాలు రాస్తున్న జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు
#.తమ బాగోతాలు బయటపడుతుండడంతో గగ్గోలు పెడుతున్న గంజాయి బ్యాచ్
# తప్పుడు పనులు చేసే వారికి అనుకూలంగా , వార్తలు రాస్తేనే అసలైన జర్నలిస్టులా ?
# ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటున్న విలేకరులు
# నిజాలు నిర్భయంగా రాస్తామంటూ గోవా బ్యాచ్ కు హెచ్చరిక
# రెండు రోజుల్లో గోవా బాధితుల తో ప్రత్యేక కథనాలు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:.నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న అవినీతి, అరాచకాలను నిర్భయంగా వెలికి తీసి ప్రజల ముందు దోషులుగా నిల్చోబెడుతున్న నికార్సయిన జర్నలిజం ఆ గ్రామంలోని దోపిడి దొంగలకు కునుకు పట్టడం లేదు. ఆ దోపిడి దొంగలకు, పైరవీకారులకు, పెత్తందారులకు అనుకూలంగా వార్తలు రాస్తేనే అసలైన జర్నలిస్తులని నిజాలను నిర్భయంగా రాసే వారిని జర్నలిస్టులు కాదంటూ పాలెం గ్రామంలోని కొందరు బడా బాబులు రుబాబు చేస్తున్నారు. చదువుల తోట కు మారుపేరుగా ఉన్న పాలెం గ్రామంలో కొందరు కబ్జారాయుళ్లు, అందినకాడికి దండుకుతినే బకాసురులు, పైరవీలు చేసుకునే పాపాత్ములు, మహిళల శీలాలకు వేలం కట్టే పెద్దమనుషులు గోవా బ్యాచ్ గా మారి పాలెం గ్రామాన్ని మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చుతున్నారు. చదువుల తల్లిగా పేరొంది ప్రశాంతతకు మారు పేరైన చిన్న గ్రామంలో పగలు, ప్రతి కారాలు, హత్యలకు నెలవుగా మార్చుతున్నారు. గ్రామంలోని యువతను గోవా టూర్ల పేరుతో మందు, విందు, పొందు రుచి చూపిస్తూ పెడదారి పట్టిస్తున్నారు. ఇలాంటి సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా వరుస కథనాలను రాస్తున్న జర్నలిస్టులను లొంగదిసుకునేందుకు ప్రయత్నిస్తున్న కొందరు పెద్దమనుషులు అడ్డదారులు తొక్కుతున్నారు. నికార్సయిన జర్నలిస్టులు ఎక్కడ తమ తప్పుడు దందాలను, అవినీతి, అక్రమాలను , అక్రమ సెటిల్ మెంట్లను బయటికి తీసి తమకు రాజకీయ జీవితం లేకుంఢా చేస్తారేమోనన్న భయంతో దొడ్డిదారులను వెతుక్కుంటున్నారు. గతాలను తవ్వుకుంటూ నిజాలు రాసే జర్నలిస్టులను ఎలాగైనా లొంగదీసుకోనేందుకు ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని చేస్తున్న నిరాధార ఆరోపణలను గ్రామ ప్రజలు తిప్పికొడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని కక్ష్యలకు, పగలకు దారితీస్తూ తప్పుదోవ పట్టి తప్పుడు ఆరోపణలు చేసే గోవా బ్యాచ్ మెంబర్లను చెప్పుతో కొట్టాలంటూ గ్రామ మహిళలు బహిరంగంగానే వారిని హెచ్చరిస్తున్నారు. నిజాలు నిర్భయంగా రాస్తూనే ఉంటాం…
పాలెం గ్రామంలో ఇదివరకు జరిగిన, జరుగుతున్న తప్పుడు పనులు, పెద్ద మనుషుల ముసుగులో గోవా బ్యాచ్ చేస్తున్న అరాచకాలపై నిజాలను నిర్భయంగా రాస్తూనే ఉంటాం. ఆనాడు నల్లవాగు అక్రమాలపై , అక్రమ రిజిస్ట్రేషన్లపై నిజాలు రాయడంతోనే ఆనాటి ఎమ్మార్వో వాటిని పరిశీలించి తప్పుడు పట్టాలను రద్దు చేశారన్నారు. తప్పుడు పనులు చేసే వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వార్తలు రాసే జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు ప్రచారాలు చేస్తే భయపడే ప్రసక్తే ఉండదు. అసలు నిజాలు ఏవో, తప్పుడు ఆరోపణలు ఏవో పాలెం గ్రామ ప్రజలకు, యువకులకు, మేధావులకు తెలుసు అన్నారు. పెద్ద మనుషుల ముసుగులో, ప్రజా ప్రతినిధుల ముసుగులో తప్పుడు పనులు చేసే వారు ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని మీ తాటాకు చప్పుళ్లకు, తప్పుడు ఫిర్యాదులకు, నిరాధార ఆరోపణలకు బెదిరే ప్రసక్తే లేదని జర్నలిస్టులు హెచ్చరించారు.