- లక్ష రూపాయల నగదు, బంగారం చోరీ
సామాజిక సారథి, సంగారెడ్డి: సదాశివపేటలో బస్సు ఎక్కిన మహిళ వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, మూడు మాసాల బంగారం చోరి జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన విజయలక్ష్మీ తన భర్త ,కూతురుతో హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బస్సు ఎక్కారు. బస్సు నందికంది వద్దకు చేరుకోగానే విజయలక్ష్మి టిక్కెట్ తీసుకునేందుకు చిల్లర కోసం తన హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసుకుంది. అప్పటికే తన బ్యాగ్ లో ఉన్న లక్షల రూపాయలు, మూడు మాసాల బంగారం దొంగలించారని తెలుసుకొని డ్రైవర్, కండక్టర్ కు విషయం తెలపడంతో డ్రైవర్ బస్సును మధ్యలోఎక్కడా ఆపకుండా నేరుగా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆపారు. పోలీసులు బస్సులోని వారి బ్యాగులు తనిఖీ చేసినప్పటికీ చోరీకి గురైన లక్ష రూపాయలు , బంగారం లభించలేదు. భాదితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారాణ చేపట్టారు.