Breaking News

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

సామాజిక సారథి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్‌ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్​దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్‌ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్​ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. టెర్రస్‌పైన పలువురు చిక్కుకుపోయి దట్టమైన పొగ కారణంగా కిందికి దిగి లేని పరిస్థితి నెలకొన్నది. ఫైర్​సిబ్బంది వారిని కిందికి దించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.