Breaking News

రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?
  • వానాకాలం పంటను ఎందుకు కొనడం లేదు
  • సీఎం, మంత్రుల భాష మార్చుకోవాలి
  • బీజేపీ చీఫ్​బండి సంజయ్​ఫైర్​

సామాజికసారథి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోమారు ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనబోమని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంటను కొంటామని టీఆర్ఎస్​పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వర్​రావు ఎదుటే గోయల్‌ చెప్పారని వివరించారు. వానాకాలం పంటను సీఎం కేసీఆర్‌ ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనిపించడం లేదా? అని నిలదీశారు. ప్రత్యామ్నాయ పంటల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అని నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు తమ భాషను మార్చుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పోటీచేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఇద్దరి మధ్య ఒప్పందం కూడా కుదిరిందన్నారు. తాగు, ఊగు, దండుకో అనే  విధంగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ లిక్కర్‌ సేల్స్‌ ద్వారా రూ.50వేల కోట్ల వచ్చేలా ప్లాన్‌ చేశారని ఆయన విమర్శించారు. సీఎం, మంత్రులు భాష, యాసను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యసభ ఎంపీలపైనా సీఎం కేసీఆర్‌ కు కోపం ఉన్నట్లుందన్నారు. అందుకే రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించాలని అనుకుంటున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు తెచ్చుకున్న ప్లకార్డ్స్‌ ను వాళ్లే చించివేసి నామా నాగేశ్వరరావు మీద పడేసి వెళ్లిపోయారని అన్నారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ హౌస్‌ లో సమాధానం చెప్పిన తర్వాత టీఆర్‌ఎస్‌ పరువు పోయిందని.. అందుకే వాళ్లు మాట్లాడటం లేదని బండి సంజయ్‌ ఎద్దేవాచేశారు.