సారథి న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ ను మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ మొత్తం 57 రకాల రక్తపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కాలంలో వైద్యులు, ఇతర సిబ్బంది అందించిన సేవలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని గుర్తుచేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ను భవిష్యత్లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కార్పొరేటర్లు, వైద్యసిబ్బంది, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ రావు, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, టీఆర్ఎస్నాయకులు పాల్గొన్నారు.
- January 23, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- DIAGNOSTIC CENTER
- KTR
- MINISTER KTR
- TELANGANA
- కరోనా
- జూబ్లీహిల్స్
- డయాగ్నోస్టిక్ సెంటర్లు
- తెలంగాణ
- మంత్రి కేటీఆర్
- Comments Off on జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు