నాలుక కోస్తా.….. బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల పాటు ఎంతోమంది ఎస్సీ , ఎస్టీ , బీసీ నేతలను లీడర్లుగా తయారుచేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాలుక కోస్తానని బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఘాటుగా విమర్శన చేశారు . ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శనివారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా అసభ్య పదాచాలలతో విమర్శలు చేయడమే కాకుండా వ్యంగ్యంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉండి కూడా 8 ఏళ్ల నుంచి మర్రి జనార్దన్ రెడ్డికి నాగం జనార్దన్ రెడ్డి ఇంటి పేరు తెలవదాన్ని సమావేశంలో జనార్దన్ రెడ్డి ఇంటి పేరు ముందు ఏమో ఉండే కదా అని ఫోజులు ఇవ్వడం చూసి ఇక్కడ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు . మీ చుట్టూ ఉండే ఇప్పుడు నేతలు ఒకప్పుడు నాగం తయారు చేసిన లీడర్ లేనని అది గుర్తుంచుకోవాలని తెలిపారు . మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో రాజకీయ కక్షలతో ఉద్దేశపూర్వకంగా అక్రమ రాజకీయ కేసులు పెట్టిన ఘనత మీకే దక్కిందని వాటిని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని స్థలం మీరు ఎక్కడైనా చెప్తే మీరు చేసిన అవినీతి , అక్రమ కేసులు నిరూపించేందుకు ఆధారాలతో సహా నేను విలేకరుల సమావేశం ముందుకు వస్తానని తన సవాలను స్వీకరించవలసిందిగా వారు కోరారు . 30 ఏళ్లు మంత్రిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ అభివృద్ధి చేశాడో చేయలేదు తెలియదు కానీ , ఎనిమిదేళ్ల ఎమ్మెల్యేగా ఉన్న మీరు మాత్రం చెరువులు , కుంటలు , గుట్టలు మాత్రం స్వాహా చేసి మెడికల్ కాలేజీ , ఎంజీఆర్ పాఠశాలల నిర్మాణం , ఉచిత పెళ్లిలు అనేక సేవలు చేస్తున్నానని చెప్తున్నా ఇక్కడి ప్రజలకు మీ సేవల అందరికీ అర్థమైపోయాయని విమర్శించారు . మరో మారు నాగం జనార్దన్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని , వారిని విమర్శించే స్థాయి మీకు లేదని గుర్తుంచుకోవాలని వారు తెలిపారు . అధికారం అడ్డం పెట్టుకొని మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారిపైన అక్రమ కేసులు పెడితే , అక్కడి ప్రజలు ఎవరు భయపడరని గుర్తుంచుకోవాలని తెలిపారు .