సారథి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్పగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు.
‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ పాటించి టెస్ట్ చేయించుకుని జాగ్రత్తగా ఉండండి’ అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు లో ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.