- నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్
- బాహుబలి నోరా ఫతేహికి కూడా పాజిటివ్
సామాజికసారథి, హైదరాబాద్: కరోనా మరోసారి విజృభిస్తుంది. బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరసకు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న బోనీ కపూర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామకు కరోనా పాజిటివ్ అని తేలింది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించే లోపు కేసులు ఒక్కసారిగా పెరగడం భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్సోదరి శిల్పా శిరోద్కర్ ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు. నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోండి ..అన్ని నియమాలను అనుసరించండి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్టుకి నమ్రతా స్పందిస్తూ ‘త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని కామెంట్ పెట్టింది. అలాగే బాహుబలి చిత్రంలో మనోహరి సాంగ్ తో రచ్చచేసిన నోరా ఫతేహి కరోనా బారినపడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది. ‘హాయ్ గయ్స్.. అనుకోకుండా నేను కరోనా బారినపడ్డాను. ప్రస్తుతం నేను ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నాను. దయచేసి ఎవరు భయపడొద్దు. అందరు మాస్క్ లను ధరించండి. జీవితం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు‘ అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే నోరా నటించిన డాన్స్ మేరీ రాణీ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది.