Breaking News

చిరు ఇంట్లో భోగి సందడి

చిరు ఇంట్లో భోగి సందడి

సామాజిక సారథి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తెలుగు రాష్టాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు వరుణ్‌ తేజ్‌. దీంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. పోస్ట్‌ చేసిన కాసేపటికే లక్ష పైచిలుకు వ్యూస్‌ వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఇక నిహారిక కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో భాగమైంది. ఇంటి ముందు ముగ్గులు, వరుణ్‌ దోశలతో సహా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న సన్నివేశాలనంతటినీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.