పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో ఆ పార్టీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. బీహార్‌లోని నగర్‌కతీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రష్మీవర్మ ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. రాజీనామా కారణాన్ని ఆమె లేఖ రాసి తెలియజేశారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాత్రం రాజీనామా లేఖ అందలేదని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం తర్వాత బీహార్ రాజకీయాల్లో కలకలం రేగింది. మహిళా ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేశారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. బీజేపీ మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించలేదు. కాగా, నితీష్ కేబినెట్ మంత్రి మదన్ సాహ్ని రాజీనామా ప్రతిపాదన ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించారు. అధికారుల నియంతృత్వ పాలనతో విసిగిపోయి రాజీనామాకు శ్రీకారం చుట్టినట్లు అప్పట్లో మదన్ చెప్పారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన రష్మివర్మ రాజీనామాతో అసెంబ్లీలో బీజేపీ బలం 73కు తగ్గింది.
- January 10, 2022
- Archive
- Top News
- జాతీయం
- లోకల్ న్యూస్
- ASSEMBLY
- BIHAR
- BJP
- Constituency
- MLA
- Nagar Katiyaganj
- PATNA
- Rashmi
- Resignation
- Verma
- అసెంబ్లీ
- ఎమ్మెల్యే
- నగర్ కతీయగంజ్
- నియోజకవర్గం
- పట్నా
- బీజేపీ
- బీహార్
- రష్మీ
- రాజీనామా
- వర్మ
- Comments Off on బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా