Breaking News

తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

సామాజిక సారథి, దేవరకొండ: తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైనట్లు నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బావిభారత ప్రధాని రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభమైందని చెప్పారు. రైతును కూలిగా కాదు రైతును మళ్ళీ రాజును చేయాలన్న దేశ నాయకుకుడి యాత్ర భారత్ జోడో యాత్ర అన్నారు. రైతు కష్టాలను వినకుండా నియంతలా పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులను కడిగేద్దామన్నారు. భారత్ జూడో యాత్రకు విశేషణ స్పందన వస్తుందని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడుతుందని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన లేని కృషి చేసిందన్నారు. భారత్ జోడో యాత్రలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలు అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఇమ్రాన్ భాయ్, నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేతావత్ శ్రీధర్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు జైపాల్ నాయక్, మల్లేష్, నరేందర్, నాయకులు నేనావత్ రాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.