Breaking News

కరోనాపై అలర్ట్​గా ఉండండి

కరోనాపై అలర్ట్​గా ఉండండి

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్​రావు అలర్ట్​ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారుల‌తో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేవని స్పష్టంచేశారు. కరోనా ఉన్నంత కాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.