సామాజిక సారథి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూజాహెగ్డే స్వీకరించి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూజాహెగ్డే మొక్కలు నాటిన అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని పూజాహెగ్డే పిలుపునిచ్చారు.
- November 27, 2021
- Archive
- CINEMA GALLERY
- Top News
- సినిమా
- ‘Green India Challenge’
- ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’
- ACTRESS
- HYDERABAD
- POOJA
- నటి
- పూజా
- హైదరాబాద్
- Comments Off on నటి పూజా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’