Breaking News

అభ్యుదయ రైతు భాను

అభ్యుదయ రైతు భాను
  • వ్యవసాయం తెలియని శ్రీమంతుడు
  • ఎకరాకు 90 బస్తాలు వరి ధాన్యం దిగుబడి

సారథి, రామడుగు: ఆయనకు వ్యవసాయమంటే పెద్దగా తెలియదు. సాగు పద్ధతులు అంతకన్నా రావు. కనీసం సాగులో అనుభవం తనకు అనుభవం లేకున్నా తలపండిన రైతులను సైతం అధిగమించి పంట అధిక దిగుబడి సాధించాడు. దీంతో అందరిచేత శ్రీమంతుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన పంజాల భానుచందర్ గౌడ్ అనే యువరైతు నూతనంగా వ్యవసాయం ప్రారంభించారు. తనకు ఉన్న వ్యవసాయ పొలంలో 1010 రకం వరిని సాగుచేశాడు. నాటువేసిన నాటి నుంచి కోతకు వచ్చే వరకు అనుభవజ్ఞులైన రైతుల మెళకువలు పాటిస్తూ సమృద్ధిగా నీరు పారించి సమగ్ర వ్యవసాయ విధానాలు అవలంభించటంతో ఎకరాలో సుమారు 90 బస్తాల ధాన్యం పండించాడు. 36 క్వింటాలు వచ్చిన పంట దిగుబడిని చూసి అందరూ ఔరా అంటున్నారు. అభ్యుదయ యువరైతు మరికొందరు ఫాలో అవుతున్నారు.