![వర్మకు తెలంగాణ ప్రభుత్వం షాక్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/RGVVVFF-2.jpg?fit=259%2C194&ssl=1)
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఓ ప్రభుత్వ స్థలంలో అతడు ‘పవర్‌స్టార్’ సినిమా పోస్టర్‌ను అంటించినందుకు రూ. 4000 జరిమానా విధిచింది. రాంగోపాల్‌వర్మ ఇటీవల పవర్‌స్టార్ అనే సినిమాను ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు జీహెచ్ఎంసీకి చెందిన స్థలంలో పోస్టర్‌ను అంటించాడు. దీనిపై ఓ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. అతడు పవర్‌స్టార్ హార్డ్‌కోర్ ఫ్యాన్ అని సమాచారం. దీంతో ప్రభుత్వ ఆస్తుల్లో పోస్టర్ అంటించినందుకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది.