Breaking News

5 జిల్లాలు.. 50వేల మందికి టెస్టులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే వారం పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ప్రైవేట్ మెడికల్​ ల్యాబ్​లు, ప్రైవేట్ హాస్పిటల్స్​లో కోవిడ్ నిబంధనలు అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రేట్లు, వాటి మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయోనని ఆరాతీశారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం సోమేశ్వర్ కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు పాల్గొన్నారు.