న్యూఢిల్లీ: భారత్లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,720 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. కాగా ఒకే రోజులో 29,557మంది కోలుకున్నారు. కాగా ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. ఇప్పటివకరు 29,861 మంది ఈ వ్యాధితో మరణించారు. దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.