న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రెండు రోజులుగా కేసుల సంఖ్య 11వేలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. 311 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 9,195కు చేరిందని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. పాజిటివ్ కేసుల సంఖ్యలో ప్రస్తుతం మన దేశం నాలుగో స్థానంలో ఉంది. మన దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో కేవలం వారం వ్యవధిలోనే 70వేల కొత్త కేసులు నమోదు కాగా.. 2 వేల మంది వ్యాధి బారినపడి చనిపోయారు. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసులు ఢిల్లీ, చెన్నై, ముంబైలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.
- June 14, 2020
- Archive
- Top News
- జాతీయం
- CAROONA
- INDIA
- కరోనా
- ఢిల్లీ
- మహారాష్ట్ర
- Comments Off on 3.2 లక్షలకు కరోనా కేసులు