Breaking News

Month: July 2021

రాజన్నకు తీరొక్క మొక్కులు

రాజన్నకు తీరొక్క మొక్కులు

సారథి, వేములవాడ: శాతవాహన అర్బన్ డెవలప్​మెంట్​ చైర్మన్ జీవీ రాంకిషన్ ఆదివారం కుటుంబసమేతంగా దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Read More
దొడ్డి కొమురయ్య పోరాటం చిరస్మరణీయం

దొడ్డి కొమురయ్య పోరాటం చిరస్మరణీయం

సారథి, గొల్లపల్లి: తెలంగాణ సాయుధ పోరాటవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల దురాగతాలు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా భీకరమైన సాయుధ పోరాటంలో తెలంగాణ గడ్డపై ఒరిగారని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేష్, ఉపసర్పంచ్ మారం శేఖర్, […]

Read More
ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

సారథి, చొప్పదండి: ఏబీవీపీ చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడెల్లి లక్మిపతి మాట్లాడుతూ.. తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా నిలిచారని కొనియాడారు. శక్తివంతమైన మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించి, బానిసత్వపు సంకెళ్లు తెంచి, మాతృదేశ విముక్తికి వీరోచితంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్తిక్, సంకేర్త్, అక్షయ్, చందు, వేణు, రాజు, ఉప్పి, అజయ్, ప్రమోద్ పాల్గొన్నారు.

Read More
రాజన్న సన్నిధిలో ఇంటలిజెన్సీ ఐజీ

రాజన్న సన్నిధిలో ఇంటలిజెన్సీ ఐజీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వరి స్వామి వారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకరరావు సందర్శించారు. వారిని ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు వారిని ఆశీర్వదించారు. లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి

పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారథి, పెద్దశంకరంపేట: పల్లె ప్రగతి పనులతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అందుకోసం ప్రజలంతా సమష్టిగా కృషిచేయాలని కోరారు. ఆదివారం ఆయన మెదక్​జిల్లా పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో మహిళా సంఘాల సభ్యులకు మొక్కలు అందజేశారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పిచ్చిమొక్కలను తొలగించడం, మురికి కాల్వలను శుభ్రంచేయడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. […]

Read More
సీఎం కేసీఆర్​చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్ ​చిత్రపటానికి క్షీరాభిషేకం

సారథి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే వెంకటేశ్వర నేత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య, మాజీ ఎంపీపీ హనుమాండ్లు, జగిత్యాల జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ మారంపల్లి బాబు, రాపల్లి సర్పంచ్ నల్ల శ్యాం, సెక్రటరీ సురమల్ల సతీష్, రత్నం, రాజయ్య మాణిక్యం, ప్రకాష్, శ్రీనివాస్, జంగిలి ఎల్లయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
హంగా పల్లెప్రగతి పనులు

ఉత్సాహంగా పల్లెప్రగతి పనులు

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనుల్లో భాగంగా శనివారం శానిటేషన్, ఇంటింటికీ మొక్కల పంపిణీ చేపట్టారు. వర్షపు నీరు నిలిచే ఎగుడు దిగుడు ప్రాంతాల్లో మొరం పోయించారు. డ్రైనేజీలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, గ్రామస్తులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Read More
డ్రమ్ సీడర్ తో రైతులకు మేలు

డ్రమ్ సీడర్ తో రైతులకు మేలు

సారథి, రామాయంపేట: డ్రమ్​సీడర్​తో రైతులకు ఎంతో ఉపయోగం ఉందని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ అన్నారు. తద్వారా కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చని చెప్పారు. శనివారం ఆయన మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రాజా కిషన్ డ్రమ్ సీడర్ ద్వారా రెండు ఎకరాల్లో వరి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు కోసం డ్రమ్ సీడర్ వాడటం ద్వారా ఎకరానికి రూ.6000 నుంచి రూ.8000 వరకు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. కూలీల సమస్య తగ్గుతుందని, పంటకాలం […]

Read More