Breaking News

Day: April 22, 2020

జర్నలిస్టులూ.. జాగ్రత్త

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కోవిడ్​19) నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని ప్రింట్​, ఎలక్ట్రానిక్​ మీడియా జర్నలిస్టులు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటనలో కోరారు. జర్నలిస్టులు విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని, వార్తల సేకరణ, ఆఫీసులో విధులు నిర్వహించే సమయంలో సోషల్​ డిస్టెన్స్​ పాటించాలని కోరారు. మాస్క్​లు, శానిటైజర్ ను వెంట​ తప్పనిసరిగా తీసుకెళ్లాలని కోరారు. ఆయా సంస్థలు కూడా వారికి […]

Read More
కరోనాను తరిమికొడదాం

కరోనాను తరిమికొడదాం

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని సామాజిక దూరం పాటించి తరిమికొట్టాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నాగర్​కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని మన్ననూర్, అమ్రాబాద్, మాధవానిపల్లి గ్రామాల్లో ఆదివాసీ చెంచులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా జనజీవనానికి, దినసరి కూలీలకు ఇబ్బందులు అయినప్పటికీ లాక్ డౌన్ తప్పదన్నారు. లాక్ […]

Read More
సూర్యాపేట హైరానా

సూర్యాపేట హైరానా

83 మందికి కరోనా పాజిటివ్​ పల్లెలకు పాకిన మహమ్మారి పరిస్థితిని పరిశీలించిన సీఎస్​, డీజీపీ సారథి న్యూస్​, నల్లగొండ: పట్టణాలకే పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి జిల్లా ప్రాంతాలు, క్రమంగా గ్రామాలకూ పాకుతోంది. తాజాగా సూర్యాపేట ఉదంతమే దీనికి నిదర్శనం. ఈ నెల 2వ తేదీన మొదటి కరోనా పాజిటివ్​ కేసు నమోదుకాగా, కేవలం 20 రోజుల్లోనే.. బుధవారం నాటికి 83 కేసులకు చేరింది. ఢిల్లీ మర్కజ్​కు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి నుంచి జిల్లాలో ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్​ […]

Read More
అన్ని పంటలకూ గిట్టుబాటు

అన్ని పంటలకూ గిట్టుబాటు

సారథి న్యూస్, మెదక్: రాష్ట ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సింగూర్, నిజాంసాగర్ బ్యాక్ వాటర్ రైతులకు జొన్నలు, శనగల కొనుగోలు విషయంలో పట్టా పాస్ బుక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ […]

Read More
వలస కూలీలకు సరుకులు

వలస కూలీలకు సరుకులు

సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగరాజు వలస కూలీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన పట్టణంలోని మార్కెట్​లో తిరిగి కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు   సూచనలు చేశారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, స్థానిక  సీఐ నాగయ్య, ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.

Read More
కరోనా నుంచి కాపాడు తల్లి

కరోనా నుంచి కాపాడు తల్లి

అష్టాదశశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్​ జోగుళాంబ అమ్మవారి.. సారథి న్యూస్​, అలంపూర్​: అష్టాదశశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్​ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం లోకకల్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మరి నుంచి దేశప్రజలంతా సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ అర్చకులు వేదపండితులు మహాసంకల్పం చేశారు. దేవీ సప్తశతి పారాయణాలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన చండీహోమం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. ప్రభుత్వం, దేవాదాయశాఖ ఆదేశాల మేరకు భక్తులను […]

Read More
‘మల్లన్న సాగర్’ కంప్లీట్​ కావాలె

‘మల్లన్న సాగర్’ కంప్లీట్​ కావాలె

సారథి న్యూస్​, దుబ్బాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు పెండింగ్ సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్​ రజత్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని మల్లన్న సాగర్ జలాశయ పనులను పరిశీలించి, పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. డిసెంబర్ మొదటి వారంలోగా పనులు పూర్తవాలని ఆదేశించారు. పనుల్లో క్వాలిటీ ఉండాలని సూచించారు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ కాలనీ అంశంపై అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ తో చర్చించారు. […]

Read More
కొర్రీలు పెట్టొద్దు..కొనండి

కొర్రీలు పెట్టొద్దు..కొనండి

సారథి న్యూస్, మెదక్: ధాన్యం కొనేందుకు కేంద్రం నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని ఆరోపిస్తూ రైతులు  బుధవారం మెదక్​ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. మండలంలోని వెల్దుర్తి, ఆరెగూడెం గ్రామాల రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు వెల్దుర్తి సహకార సొసైటీ  కొనుగోలు కేంద్రానికి వచ్చారు. తాము పొలం వద్ద శుభ్రంచేసి ధాన్యాన్ని తీసుకొచ్చినా కూడా మళ్లీ కేంద్రం వద్ద మరోసారి శుద్ధిచేయమంటున్నారని ఆక్షేపించారు. 16శాతం తేమతో వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని తెచ్చినప్పటికీ ఇక్కడి అధికారులు […]

Read More