- రాష్ట్రంలో ఇద్దరి మృతి
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో 146 కరోనా కేసులు ఆదివారం నమోదయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 24 గంటల్లో 26,625 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 146 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,70,435 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,846 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,007కు పెరిగింది.