ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48,916 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి చేరుకున్నది. ఇప్పటివరకు కరోనాతో 31,358 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా 8,49,432 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 4,56,071 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.