సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్ పాయల్ ఘోష్ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్లో చాలామంది డ్రగ్స్ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్ తీసుకుంటారని నేను చెప్పడం లేదు. కానీ డ్రగ్స్ తీసుకునే హీరోలు చాలా మంది నాకు తెలుసు.. వారు డ్రగ్స్ వాడడాన్ని నేను కళ్లారా చూశాను. బాలీవుడ్లో ఓ డైరెక్టర్ ఉన్నారు. కొత్తవాళ్లను ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయన నా ముందే చాలాసార్లు డ్రగ్స్ తీసుకున్నారు. ఓ సారి నాకు స్టోరీ వినిపిస్తానని ఆయన ఆఫీసులోని ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ నాకు పోర్న్‌వీడియోలు చూపించాడు. ఆయన అప్పటికే చాలా మత్తులో ఉన్నాడు. నేను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను’ అంటూ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది పాయల్.