హాంకాంగ్: ఇండియాలో ఇప్పటికే నిషేధానికి గురైన టిక్‌టాక్ దాదాపు 6బిలియన్ డాలర్ల నష్టాన్ని మూతగట్టుకుంది. అమెరికా కూడా దాన్ని నిషేధించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్ నుంచి కూడా టిక్‌టాక్ నిష్క్రమించింది. మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో దాదాపు 1.50లక్షల మంది యూజర్లను టిక్‌టాక్ కోల్పోనుంది. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంట్ ఈ మధ్య కాలంలో జాతీయ భద్రతా చట్టానికి ఆమోదం తెలిపింది. అక్కడ నిరసనలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చైనా తీరును విమర్శిస్తూ ఒక తాటిపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో టిక్‌టాక్ నిష్క్రమించినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్ నిర్వాహకులతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్‌లో టిక్‌టాక్ అధికార ప్రతినిధి ప్రకటించారు. హాంకాంగ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
- July 7, 2020
- Archive
- Top News
- జాతీయం
- DOLLERS
- HANKONG
- INDIA
- TIKTOK
- ఇండియా
- టిక్‌టాక్
- Comments Off on హాంకాంగ్ నుంచి టిక్‌టాక్ నిష్క్రమణ