Breaking News

హరిభూషణ్​కు మావోయిస్టు పార్టీ బాధ్యతలు?

హరిభూషణ్​కు మావోయిస్టు పార్టీ బాధ్యతలు?

సారథి న్యూస్​, హైదరాబాద్​:​ సీపీఐ(మావోయిస్ట్) పార్టీ తెలంగాణలో మళ్లీ పాగావేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రకమిటీతో పాటు ఏరియా కమిటీలను ప్రకటించి పోలీసులకు సవాల్ విసిరింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. ఏడుగురు సభ్యులతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్లూరి ప్రసాద్, హరిభూషణ్, బండి ప్రకాష్, దామోదర్, భాస్కర్, సాంబయ్య, కంకణాల రాజిరెడ్డితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు పర్యవేక్షణలో రాష్ట్రకమిటీ పనిచేస్తుందని, 12 ఏరియా కమిటీలు ఉంటాయని తెలిసింది.
ఏరియా కమిటీలు ఇవే?
–కంకణాల రాజిరెడ్డి నేతృత్వంలో జయశంకర్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, వరంగల్, పెద్దపల్లి ఏరియా కమిటీ కొనసాగుతుతున్నట్లు తెలుస్తోంది.
–రీనా అలియాస్ సమే నేతృత్వంలో ఏటూరునాగారం, మహదేవ్ పూర్ ఏరియా కమిటీ.
– ఉంగి ఆధ్వర్యంలో వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ.
– మంగు నేతృత్వంలో ఇల్లందు, నర్సంపేట ఏరియా.
– అడెల్లు అలియాస్ భాస్కర్ ఆధ్వర్యంలో మంచిర్యాల కొమరం భీం జిల్లా కమిటీ.
– లింగమ్మ నేతృత్వంలో మంగీ ఏరియా కమిటీ.
– వర్గేష్ నేతృత్వంలో ఇంద్రవెల్లి ఏరియా కమిటీ.
– నరసింహారావు ఆధ్వర్యంలో చెన్నూర్, సిర్పూర్ ఏరియా కమిటీ.
– సమ్మక్క అలియాస్ శారద నాయకత్వంలో చర్ల శబరి ఏరియా కమిటీలను నియమించినట్లు తెలిసింది.
– రమాల్కు మణుగూరు ఏరియా కమిటీ బాధ్యతలు.
– సాంబయ్యకు భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్ గోదావరి డివిజనల్ కమిటీ బాధ్యతలు.
– బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నేతృత్వంలో తెలంగాణ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని సమాచారం.