సారథి న్యూస్, రామాయంపేట: యూపీలోని హథ్రాస్ ఘటనపై యావత్ దేశం తీవ్రంగా స్పందిస్తున్నది. నిందితులను ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లా నిజాంపేట మండలలో శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హథ్రాస్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే ఉరితీయాలని నేతలు డిమాండ్ చేశారు.
పశుగ్రాసం కోసం వెళ్లిన యువతిని లాక్కెళ్లి ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేయడం అమానవీయ చర్య అని అభివర్ణించారు. అనంతరం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని దహనం చేయడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోమ్మట బాబు పాతురిరాజు, దుబాసీ సంజీవ్ గరుగుల శ్రీనివాస్ కోమ్మట సుధాకర్, టంకరి లక్ష్మీణ్ కే నర్సింహులు కోమ్మట రాములు జి రాజయ్య కే ఇంద్రసేన జంగాల గంగారామ్ సామల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.