సారథి న్యూస్, కర్నూలు: కరోనా వ్యాప్తి సమయంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు.
మంగళవారం కర్నూలు నగరంలోని రీజినల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. సైబర్‌నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచి ఉద్యోగాలు) ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ వెబ్ సైట్లతో ఆన్ లైన్ లో ఉద్యోగాలు చేసే వారిని మోసం చేస్తున్నారని వివరించారు. ఎస్పీ వెంట ఈకాప్స్ ఇన్చార్జ్రాఘవరెడ్డి, ఎస్సైలు వేణుగోపాల్ రెడ్డి, సైబర్ టెక్నిషియన్స్ ఉన్నారు.
- July 15, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- CARONA
- CYBER
- Kurnool
- ఎస్పీ ఫక్కీరప్ప
- కర్నూలు
- సైబర్‌నేరాలు
- Comments Off on సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి