తమిళనాడులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. ఇటీవల పలువురు సినీ, రాజకీయప్రముఖుల ఇంట్లో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్లు రావడం.. తీరా పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపడితే ఏమీ దొరకపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే సూపర్‌స్టార్ రజినీకాంత్, అజిత్, మణిరత్నం, విజయ్ తదితరుల ఇంట్లో బాంబులు పెట్టామంటూ ఆకతాయిలు ఫోన్లు చేశారు.
విచారించిన పోలీసులకు అవన్నీ ఫేక్‌కాల్స్ అని తేలింది. అయితే తాజాగా ప్రముఖ హీరో ఇంట్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. చెన్నై అల్వార్‌పేట ఏరియాలో ఉన్న సూర్య ఆఫీసులో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. అలర్టయిన పోలీసులు డాగ్‌స్వ్కాడ్ సాయంతో తనిఖీలు చేశారు. ఆ ఏరియాలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.