Breaking News

సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సదనం

హంగులతో సరస్వత సదనం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పద్మభూషణ్ జ్ఞానపీఠ గ్రహిత డాక్టర్​సి.నారాయణరెడ్డి 89వ జయంతి సందర్భంగా బుధవారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించనున్న డాక్టర్​ సినారె సరస్వత సదనం ఆడిటోరియానికి మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్​గౌడ్​శంకుస్థాపన చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కె.చంద్రశేఖర్​రావు కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవిస్తున్నారని అన్నారు. సినారె సేవలకు గుర్తింపుగా ఆధునిక హంగులతో గొప్ప ఆడిటోరియాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సరస్వత సదనం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్​రంజన్, కవులు, కళాకారులు పాల్గొన్నారు.