Breaking News

సిద్దిపేట ఒడిలో గోదారమ్మ

సిద్దిపేట ఒడిలో గోదారమ్మ

సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట ఒడిలో గోదారమ్మ జలసవ్వడి చేసింది. చంద్లాపూర్‌ వద్ద రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు మోటార్ ను ఆన్‌ చేసి రంగనాయక సాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాలను విడుదల చేశారు.

తొలుత చంద్లాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్‌హౌస్ వద్ద పంప్‌ను ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే వ్యవస్థ వద్ద మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్‌, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్‌, వెంకటేశ్వర్లు, కలెక్టర్‌ వెంకటరామారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు జలహారతి ఇచ్చారు. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో సాదాసీదాగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 2,300 ఎకరాల్లో రూ.3,300 కోట్ల వ్యయంతో  మూడు టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మించారు. జలాశయం ప్రారంభమవడంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1,14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.