Breaking News

సిద్దిపేటలో కేసీఆర్​ నగర్​

సిద్దిపేటలో కేసీఆర్​నగర్​

సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. సిద్దిపేటలో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తొలి విడతలో 1, 341 ఇళ్లు, రెండో విడత వెయ్యి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.