Breaking News

సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సారథి న్యూస్, శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య అధ్యక్షతన శ్రీకాకుళం లోగోను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ శాఖ, ప్రజలతో కలిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో సుమారు 15 ప్రాంతాలు ప్లానింగ్ లేకుండా కట్టడాలు జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం పోటీ పరీక్షల్లో నైపుణ్యం సాధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మెంటాడా స్వరూప్, నక్కరామరాజు, పొన్నాడ ఋషి, మహిబుల్లా ఖాన్, అరుణకుమార్, అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్, ఏసీపీలు దేవకుమార్, సత్యనారాయణ, టౌన్ ప్లానింగ్ ఏడీ జోగారావు విశాఖపట్నం, కళింగ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాధు వైకుంఠారావు,చల్లా శ్రీనివాసరావు, కోణార్క్ శ్రీను పాల్గొన్నారు.