Breaking News

సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ
  • కేంద్రానికి లేఖ రాస్తానన్న డీకే అరుణ

సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ అండర్ గ్రౌండ్‌ పంప్‌ హౌస్​కే ప్రభుత్వం మొగ్గుచూపుతోందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలతో పంటనష్టం జరిగితే పటించుకునే వారేలేన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హైదరాబాద్ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరిగినా సీఎం కేసీఆర్‌ స్పందించడం లేదు. ఆయన కనీసం వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే కూడా చేయడం లేదన్నారు.