సారథి న్యూస్, హైదరాబాద్: ఎల్‌బీ నగర్ సర్కిల్ పరిధిలోని సాగర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్హైదరాబాద్వాసుల ట్రాఫిక్కష్టాలు తీరనున్నాయని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఎస్సార్‌డీపీ ఫేజ్-1 ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో ప్రీకాస్ట్ విధానంలో నిర్మించారు. దేశంలోనే మొదటిసారి ప్రత్యేక టెక్నాలజీని ఈ నిర్మాణంలో వినియోగించినట్టు చెప్పారు. కాగా, ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సికింద్రాబాద్ నుంచి ఎల్‌బీనగర్ మీదుగా శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే వైపునకు, అలాగే నాగార్జున సాగర్ హైవే వైపునకు వెళ్లేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి.
- August 10, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- FLYOVERBRIDGE
- HYDERABAD
- LB NAGAR
- MINISTER KTR
- తెలంగాణ
- మంత్రి కేటీఆర్
- సాగర్‌రింగ్‌రోడ్డు
- Comments Off on సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ ప్రారంభం