Breaking News

సన్న వడ్లను కొంటాం

సన్నవడ్లను కొంటాం

సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.40 లక్షలు సొంత ఖర్చులతో తన దివంగత సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం రైతుల కోసం నిర్మించిన రైతువేదిక భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సన్న ఒడ్లను కొంటామని స్పష్టంచేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రధాని సొంతం రాష్ట్రం గుజరాత్ లో కూడా సగం కరువు ప్రాంతమే సాక్షాత్కరిస్తుందన్నారు. దేశంలో అన్ని పంటలకు అనుకూలమైన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని వివరించారు. నీళ్ల కోసమే తెలంగాణ నడిచిందని, సీఎం కేసీఆర్​ నాయకత్వంలో కరువు అనే పదాన్ని పారదోలామని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న వ్యవసాయ అనుకూల నిర్ణయాలు దేశానికి దిక్సూచిలా నిలుస్తాయని వెల్లడించారు.

మంత్రులు ప్రారంభించిన రైతువేదిక భవనం

అభివృద్ధి పనులకు శ్రీకారం
–ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం, వీవీ పాలెం, వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం వీవీ పాలెం, మధిర నియోజకవర్గం ముష్టికుంట్ల గ్రామంలో రైతు వేదికలను ప్రారంభించారు.
– జింకల్ తండా రోడ్డు మార్గంలో రూ.11.5కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెటింగ్ గోడౌన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
– జింకల్ తండా రోడ్డు మార్గంలో రూ.1.43 కోట్ల వ్యయంతో 1200 టన్నుల నిల్వ సామర్థ్యం గల మార్కెటింగ్ నిర్మించనున్న గోడౌన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
– రూ.1.43కోట్ల వ్యయంతో నిర్మించిన విత్తన నాణ్యత ల్యాబ్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు హరిప్రియ, రాములు నాయక్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మేయర్ పాపాలాల్, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ , డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్​వీ కర్ణన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్​రావు, జిల్లా వ్యవసాయ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.