సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ కూల్చివేతపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. భవనాల కూల్చివేత ద్వారా ఐదులక్షల మందికి శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయని ప్రొఫెసర్విశ్వేశ్వర్ ఫిటిషన్ దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకునే సెక్రటేరియట్భవనాల కూల్చివేత పనులు చేపడుతున్నామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. కేబినెట్నిర్ణయం తీసుకున్న ఫైనల్ రీపోర్ట్ కాపీని షీల్డ్ కవర్లో ఏజీ కోర్టుకు సమర్పించారు. 25 ఎకరాల్లో ఉన్న సచివాలయంలో 11 బ్లాక్ లు ఉన్నాయని, ఇందులో ఎలాంతో ఫైర్ సేఫ్టీ లేదని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది.
132ఏళ్ల క్రితం నిజాం నిర్మించిన భవనాల దాదాపు లక్ష టన్నుల వ్యర్థాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కూల్చివేతకు అత్యాధునిక యంత్రాలు ఉపయోగిస్తున్నట్లు విన్నవించింది. కాంక్రీట్ ను తొలగించేందుకు 26 మీటర్ల ఎత్తయిన యంత్రం, 22 మీటర్ల ఎత్తయిన 3 యంత్రాలు,16 మీటర్ల యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. 20 టన్నుల సామర్థ్యం కలిగిన ఎక్స్ కావేటర్లు నాలుగు, 20 టన్నుల బకెట్లు నాలుగు, మూడు దంపర్లు, వ్యర్థాలను తొలగించేందుకు 25 తిప్పర్లను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. కాగా, సచివాలయం కూల్చివేతపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్పెషల్ లివ్ పిటిషన్ దాఖలుచేశౄరు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. భవనాల కూల్చివేతకు సానుకూలంగా తీర్పు వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.