Breaking News

సచిన్​ పైలట్​కు మరో షాక్​

న్యూఢిల్లీ: సొంతపార్టీపైనే తిరుగుబాటు చేసి రెండుసార్లు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సచిన్‌పైలెట్‌పై చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్‌ బుధవారం ఉదయం తాజాగా నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే అనర్హతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో చెప్పింది. సచిన్‌ పైలెట్‌తో పాటు ఆయన తరఫు 18 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత వాళ్లు ఇచ్చే వివరణను బట్టి సీఎల్పీ మెంబర్‌‌షిప్‌పై ఆలోచిస్తామని స్టేట్‌ పార్టీ ఇంచార్జ్‌ అవినాశ్‌ పాండే అన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్‌పైలెట్‌ సోమవారం, మంగళవారం రెండ్రోజులు జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన్ను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.