సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర మహిళా స్రీ,శిశు సంక్షేమ, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వెబినార్ ద్వారా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ.. వైకల్యం మనిషికి మాత్రమేనని మనసుకు కాదని, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ దృష్ట్యా వేడుకలను పెద్దఎత్తున నిర్వహించలేకపోయినా అన్ని జిల్లా కేంద్రాల్లోని దివ్యాంగులతో మాట్లాడే అవకాశం రావడం సంతోషకరమన్నారు. అనంతరం కలెక్టరేట్కాన్ఫరెన్స్ హాలులో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అడిషనల్ కలెక్టర్ ఆదర్శసురభి దివ్యాంగులకు శుభాభివందనాలు తెలియజేస్తూ వారితో కేక్ కట్ చేయించారు. ప్రతినెలా 4వ శనివారం దివ్యాంగుల గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని అన్నారు. ఆర్టీసీ బస్ పాస్ రెన్యువల్ కోసం సంబంధిత అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. కార్యక్రమలో డీఆర్డీవో ఎ.పారిజాతం, డీడబ్ల్యూవో ప్రేమలత, వికలాంగుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి మాణిక్యం, శ్రీనివాస్, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.
- December 3, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- వరంగల్
- CAROONA
- COVID19
- HANDCAPED
- MULUGU
- కరోనా
- కోవిడ్19
- తెలంగాణ
- దివ్యాంగులు
- ములుగు
- శిశుసంక్షేమశాఖ
- Comments Off on వైకల్యం మనిషికి మాత్రమే..