సారథి న్యూస్, కర్నూలు: తాడేపల్లి క్యాంపు ఆఫీసును నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ (ప్లస్) పథకం ద్వారా జిల్లాలో మైదాన ప్రాంతం, చెంచు గిరిజన కాలనీల్లో ఉన్న 3,549 అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 3,93,472 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. అక్కాచెల్లెమ్మలకు సంపూర్ణ ఆరోగ్యం, అంగన్వాడీ చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటను వేస్తూ.. పోషకాహార లోపం వల్ల కలిగే రక్త హీనత, ఎదుగుదల లోపం, మాతా శిశు మరణాలను నివారించి సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన భావిభారత పౌరులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం కొంతమంది గర్భిణులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద ‘టేక్ అవే హోమ్’ పోషకాహార కిట్స్ ను అందజేశారు. కర్నూలు నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ(అభివృద్ధి) ఎస్.రామసుందర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.
- September 7, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDRAPRADESH
- AP CM JAGAN
- YSR SAMPURNAPOSHANA
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి
- కర్నూలు
- వైఎస్సార్సంపూర్ణ పోషణ
- Comments Off on ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం