న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉన్నదని ఏ శక్తి దాన్ని కాపాడలేదని ఆప్ అధికార ప్రతినిధి రాఘవ చాదా విమర్శించారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భారతీయజనతాపార్టీ, కాంగ్రెస్ అధికారం కోసం కుట్రలు పన్నుతున్నాయని, ఈ రెండు పార్టీలకు ప్రజలపై ప్రేమలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఇక భవిష్యత్తులో దేశాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదని అన్నారు. పార్టీకి యువత అవసరం ఉందని, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా చర్యలు అవసరం అని అన్నారు. ‘రాజస్థాన్‌లో జరుగుతున్న పొలిటికల్ డ్రామాను దేశ ప్రజలంతా చూస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి. కానీ మన దేశంలో మాత్రం ఒక పార్టీ ఎమ్మెల్యేలను అమ్మాలని చూస్తోంది.. మరో పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తొంది’ అని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రత్యామ్నాయంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తుందనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని.. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ముసలిదైపోయిందని, కచ్చితంగా కూలిపోతుందని ఆయన అన్నారు.
- July 17, 2020
- Archive
- Top News
- జాతీయం
- AAP
- CONGRESS
- DELHI
- POLITICS
- రాఘవ చాదా
- వెంటిలేటర్
- Comments Off on వెంటిలేటర్‌పై కాంగ్రెస్